ఉగాది ;-::అక్షిత-10వ,తరగతి-జి.ప.ఉ.పా .రామంచ
 అంతులేని కాలానికి ఆది
తెలుగు వారు జరుపుకునే మొదటి ఉగాది
షడ్రుచుల సంతోషాల సారధి
మధురానుభూతి స్మృతుల వారధి
సంస్కృతి సాంప్రదాయాలకు పెన్నిధి
ప్రతి ఏడాది వచ్చే ప్రియమైన అతిథి ఉగాది
వచ్చేసింది వచ్చేసింది తెలుగు సంవత్సరాది
ఉషోదయాల ఉషస్సులతో ఉత్సాహాన్ని నింపే ఉగాది
ఇంద్రధనస్సు రంగులతో ఊహల ఊయల లాగే
మన మది అయింది ఉగాదితో ఆకాశవీధి
ఆంగ్ల సంవత్సరాది పై మక్కువ ఎక్కువై
మన సాంప్రదాయాలకు సమాధి 
మన మదిలో ఇరుకైపోయింది ఉగాది
ఉగాది ఉత్సవాలను ఆదరించడం మన విధి
మన సంస్కృతి శోభిల్లడానికి కావాలి ఉగాది ఓ పునాది
హృదిలోని క్రోధిపై గెలుపు సాధించి
క్రోధినామ సంవత్సరం
కొత్త ఆశలను నెరవేర్చాలని ఆశీస్తూ...
అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు
రామిని భాస్కర్, ZPHS రామంచ చెప్పారు…
చాలా బాగుంది