వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రపంచ ప్రజలను ఆకర్షించడానికి కారణం భవిష్యత్తులో కూడా జరగబోయే విశేషాలను తన సూక్ష్మ దృష్టితో గమనించి వ్రాయడం ధర్మానికి ప్రథమ తాంబూలం ఇవ్వడం ధర్మం ఏ దేశంలో నైనా ఏ రాష్ట్రంలో నైనా ఏ గ్రామంలోనైనా ఒకటిగానే ఉంటుంది న్యాయం ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంబంధం లేకుండా మారిపోతూ ఉంటాయి ఆ విషయాన్ని వ్యాసులవారు తన కథా గమనంలో శ్రీకృష్ణుని ద్వారా అనేక చిత్రాలను చేయించారు అందుకే వారిద్దరూ ఆంధ్రులకే కాదు ప్రపంచ ప్రజానీకానికి ఆదర్శప్రాయమైన ఆదికవి ఆదిరచయిత వారిద్దరినీ మర్చిపోయినప్పుడు దేశంలో శాంతి భద్రతలు ఉండవు సంస్కృతి సంప్రదాయాలు నిలువవు అని విజ్ఞులు తెలియజేస్తూ ఉన్న విషయం దానిని పాటించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది. సౌత్ అమెరికా సముద్ర తీరంలో బర్ముడా ట్రయాంగిల్ ఉంది దాని పైనుంచి ఎలాంటి వాహనం విమానం నుంచి ఏ వాహనం ఎటు ప్రయాణం చేసినా దాని నీడ ఈ ట్రయాంగిల్ మీద పడిన మరుక్షణం అది దాని పరం అవుతుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అలాగే లంకకు సమీపంలో లేక్ ఆఫ్ నో రిటర్న్ అని ఉన్నది అది కూడా బర్ముడా ట్రయాంగిల్ లాంటిదే. దానిని ఈ రక్షాసిగా మనం భావించవచ్చు ఆ రోజుల్లోనే శాస్త్ర విజ్ఞానాల గురించి వాల్మీకి మహర్షి చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నట్లయితే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈరోజుకూ మనం ఎందుకు అంత స్థాయికి వెళ్లలేకపోయాము అని మనలను మనం ఆలోచించుకొని ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది విమానాలు కూడా ఆ రోజున ఆయన సృష్టి. కుబేరుని వద్ద ఉన్న విమానాన్ని రావణాసురుడు తన సొంతం చేసుకున్నాడు అని వాల్మీకి మహర్షి మనకు తెలియజేశారు దానిలో ప్రత్యేకత ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నా మరొక వ్యక్తి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ఆనాడు వారికి ఉన్న శాస్త్రీయ జ్ఞానం ఈనాడు మనం విమానాలను తయారు చేసుకున్న వారి కొన్న పరిజ్ఞానం మనకు ఉన్నదా అని ఒక్కసారి మనలను మనం విశ్లేషించుకున్నట్లయితే శాస్త్ర పరిజ్ఞానంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనకే అర్థమవుతుంది రామాయణం పేరు పెట్టడం కానీ దానిలో పాత్రల పేర్లను ఎంచడం కానీ మన వల్ల కాదు ఆ పాత్ర పేరు తెలియగానే ఆ పాత్ర గుణగణాలు అన్నీ మనకు తెలిసిపోతాయి ఏ పాత్రను మీరు ఉదాహరణగా తీసుకున్న దాని అర్థం దానికి ఉండేలా అద్భుతమైన జ్ఞాన సంపదతో పాత్రల పేర్లు సృష్టించడం వారికే తగును.
కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి