కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మన పెద్దలు చెప్పిన మాట కష్టేఫలి  ఏ ప్రాణి అయినా కష్టపడితే దానికి తగిన ఫలితం వస్తుంది  ఒక పక్షి తన పిల్లలను సంరక్షించుకోవడం కోసం ఆహార  సేకరణ కోసం మిగిలిన ప్రాంతాలకు వెళ్లి సేకరించి దానిని తీసుకువచ్చి  బిడ్డలను పోషిస్తుంది  తన కృషిని ఒక పక్షి కూడా మర్చిపోలేదు  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంతవరకు కూడా తన పనిని అది సక్రమంగా చేస్తూనే ఉంటుంది  బిడ్డలను కాచి రక్షించుకుంటూనే ఉంటుంది  అలాంటి స్థితి మానవులకు రావాలి అని శ్రీకృష్ణ పరమాత్మ   అర్జునునకు చెప్పినట్టుగా ఉంటుంది  కానీ భగవద్గీత వ్రాసినది  ఆదిశంకరాచార్యుల వారు ఏడవ శతాబ్దంలో అన్న విషయాన్ని  మనం విస్మరించరాదు  దానిలో మానవ జీవితం ఎలా గడపాలో మనకు తెలియజేశారు ఆయన.
నీవు నీ కోసం నియోగించబడిన పనిని నీవు తప్పక చేసి తీరాలి  దాని ఫలితం ఏమిటి అని ఆలోచించవద్దు అని గీతమనకు తెలియజేస్తుంది  కానీ మనం ఏం చేస్తున్నాం  తల్లిదండ్రులు మనకోసం కూడ బెట్టిన ఆస్తిపాస్తులను అమ్మి  దానితో మన అవసరాలు తీర్చుకుంటూ  చివరకు కుటుంబాన్ని  బజారు పాలు చేస్తున్నాం  నీవు నీ పని సక్రమంగా చేస్తే ఆ స్థితి రాదు కదా అని  శంకరాచార్య   భావన  ఇవాళ రాష్ట్రం మొత్తంలో జరుగుతున్న విషయం ఏమిటి అని ఒక్కసారి మనం గమనించినట్లయితే  మీరు ఇంటిలో నుంచి కదల వద్దు  మీకు కావలసిన డబ్బులు మేము ఇస్తాము  మీరు మాకు ఓట్లు వేసి గెలిపించండి దానికి తగిన ప్రతిఫలం మీకు వస్తుంది  అనేసరికి జరిగేది ఏమిటి.
మనం కష్టపడకుండా  మన కుటుంబం జరిగిపోతుంది కదా  అన్న అభిప్రాయం వారిలో వస్తుంది  ఇవాళ మీరు ఏ పలికైనా వెళ్లండి  ఏ రైతుకు తన చేలో పని చేయడానికి ఒక్క మనిషి దొరకడం లేదు  అది వారి తప్పు కాదు కదా ప్రభుత్వం చేస్తున్న తప్పు  అది ఎవరికి  నష్టం సమాజానికి కదా  సరిగా పంటలు పండించనప్పుడు జరిగేది ఏమిటి     మనం తినడానికి కావలసిన బియ్యం పప్పులు కూరగాయలు  మనకు దొరకవు  ఒకవేళ దొరికిన అవి మనం కొనే స్థితిలో ఉండం  పరోక్షంగా ప్రభుత్వం చేస్తున్నది వారిలో బద్ధకత్వాన్ని  ప్రబలంచేసి  పంటలు లేకుండా చేయడం  దానివల్ల ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి దిగుమతి చేయించుకోవడం  అవి కొనలేని స్థితిలో ఉన్నవాడు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది  ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించేవారు ప్రశ్నించేవారు లేకపోవడం మరొక కారణం సమాజంలో.
కామెంట్‌లు