కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితంలో భక్తిని గురించి మన పెద్దలు మనకు  మంచి విషయాలు చెబుతూ ఉంటారు  దేవాలయానికి వెళ్లడం వలన  ఇతరులు ఎలా  ప్రవర్తిస్తున్నారో చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది  దర్శనం చేసేటప్పుడు మనం ఎలా  చేయాలో వారి ద్వారా తెలుసుకోవచ్చు  ప్రదక్షణం చేయమన్నప్పుడు  మన చుట్టూ మనం తిరగకూడదు ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి  శివాలయంలో నాలుగు ప్రదక్షిణలు చేయాలి విష్ణువు ఆలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ  మూడు పర్యాయాలు చేస్తే సరిపోతుంది. పూజ చేయడానికి సాధనం శరీరం  ధర్మసాధన చేయడానికి  శరీరమే మూలము అని మన వేదాంతులు చెబుతారు  శరీర మాద్యం కలు ధర్మ సాధనం  అన్నది వేదోక్తి  దానిని అనుసరించి ఈ పూజను  సక్రమంగా చేయాలి.పూజ చేయడంలో రెండు రకాలు  మన ఎదుట దైవాన్ని విగ్రహంగా భావించి పూజించడం  మొదటి పద్ధతి ఇది జీవితంలో అర్థం అయిన తర్వాత  నిరాకారంతో మొదలవుతుంది  ఎలాంటి ఛాయాచిత్రాలను కానీ బొమ్మలను కానీ పెట్టకుండా  భగవాన్ నామాన్ని మాత్రమే స్మరిస్తూ పంచెంద్రియాలను దానిపై  సమన్వయపరిచి  అంకిత భావంతో చేస్తూ ఉన్నప్పుడు  మనసు నిర్మలంగా ఉండి  నీవు ఏ భగవత్ స్వరూపాన్ని  చూడాలని కాంక్షిస్తున్నావో  ఆ విగ్రహం తనకు తప్పకుండా దర్శనమిస్తుంది నీవు ఏ ఆకారాన్ని తలుచుకుంటే ఆ ఆకారంలో  భగవంతుడు దర్శనం ఇస్తాడు అని వేదాంతలు మనకు తెలియజేస్తారు  నిజానికి ఆయనకు ఆకారం లేదు అని అందరికీ తెలుసు  మన భావన  దానిపై మన దృష్టి కేంద్రీకరణ వల్ల మనకు కావాల్సిన  స్వరూపం  మన ఎదుట సాక్షాత్కరిస్తుంది.
భౌతికంగా మనం చేస్తున్న పూజ  మనకు పరలోక కూడా కనిపిస్తూ ఉంటుంది  దీని తరువాత చేసేది జపం  ఇది మనసుతో చేసేది  మనసును జపమాలపై దృష్టి అని పెట్టి  దానిని తిప్పుతూ భగవాన్ నామాన్ని స్మరిస్తూ ఉంటే  ముక్తి కలుగుతుంది  ధ్యానం చేయాలంటే అది ఆత్మకు సంబంధించిన విషయం  నీ అంతరాత్మ ప్రలోభం వల్ల  ఎలాంటి ధ్యానం చేయాలి  త్రిమూర్తులలో ఎవరిని ఆచరించాలి అన్నది తెలుసుకొని ఆధ్యానంలో నిమగ్నమై ఉండాలి  ఈ పూజ జప తపాలను ఇవన్నీ మనకు తెలియజేసేది నేర్పేది ధర్మం  ధర్మాలన్నిటిలోనూ ఉత్తమమైనది అహింస  అందుకే మహాత్మా గాంధీ అహింసను ఒక ఆయుధంగా వాడారు స్వాతంత్ర్యాన్ని సంపాదించారు  అన్న విషయం మనకు తెలుసు  అందుకే అహింసో పరమో ధర్మః ధర్మో రక్షతి రక్షితః అన్నవి వెలుగులోకి వచ్చాయి.


కామెంట్‌లు