చురుకైన చిలుక ;- (బాలగేయం )-మమత ఐల-కరీంనగర్-9247593432
అడవిలోన బోయవాడు కాపుగాసెను
వలవేసి చిలకలను పట్టుచుండెను
కంటి రెప్పవోలెకాచి వాడవాడన
పంజరానపెట్టి వాటినమ్ముచుండెను

అందులోని ఒకచిలుకకు నచ్చకుండెను 
పంజరంబునుండలేక దిగులు చెందెను
అందమైన అడవిలోన ఉన్న స్వేచ్ఛను 
మరువలేక ఉపాయాన్ని పన్నుచుండెను

నీరు త్రాగలేక  చిలుక మందకొడిగా
తిండీ తిప్పలకోర్చి ఎండుచుండెను
అలసిసొలసి బక్కజిక్కి పోవుచుండగా
తలుపుతెరచి బోయవాడు తీసె చిలుకను

మోచేతిన పెట్టి ఊసులాడుచుండగా
ఉలుకు పలుకు లేకుండా ఉండసాగెను
ఏమరుపాటుగ నున్న బోయవాడిని
నమ్మజూసి చిలుక తుర్రునెగిరి పోయెను


కామెంట్‌లు