ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 శంకర భగవత్పాదులు రమణ మహర్షి వివేకానంద స్వామి మలయాళ స్వాముల  ఆధ్యాత్మిక ప్రవచనాలతో పరిట రిల్లిన దేశం మనది ప్రజల బుద్ధుడుగా శంకరాచార్య పేరుతో వేదముల సారమునంత అద్వైత సిద్ధాంతం చేసిన మహానుభావుడు శంకరుడు  శమ్ అంటే శుభాలను  కరుడు అంటే ఇచ్చేవాడు  అని అర్థం  ఈ భూమిపైకి ఎందుకు వచ్చామో ఎలా పెరుగుతున్నామో ఎలా నిష్కరిమిస్తున్నామో తెలియజేస్తూ ప్రపంచ చరిత్రలోనే జీవి తనువు ద్వారా సాధించే పుణ్య కార్యాలన్నీ మన ముందు నుంచి తనువును వదిలి జీవితన స్వస్థలానికి వెళ్ళే తీరును అద్భుతంగా ఆవిష్కరించడం మహనీయుడు ఆదిశంకరాచార్య  వారి అంశతో శంకర పీఠాలను అద్భుతంగా నిర్వహిస్తూ దేశ ప్రతిష్టను పెంచిన  నడయాడు స్వామి అన్న పేరుతో నిండు నూరేళ్ల జీవితంలో పోత పోసిన ఆధ్యాత్మిక మూర్తిగా మనకు నిలిచి ఉన్న శంకర భగవత్పదులు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ ఆశీస్సులను అందించిన ఘట్టం  మరపురాని మరిచిపోలేని  అదృష్టం. జీవితం చాలా ఆశ్చర్యకరం ఏదీ మన చెప్పు చేతల్లో ఉండదు  జీవితన తనువును నడిపిస్తుందో మనకు తెలియదు  బాపట్లలో జన్మించిన అనసూయమ్మ యవ్వనంలో సల్లగా ఉండి అల్సర్ తో బాధపడుతూ ఉండేది ఆమెకు విద్యాగంధం లేదు అ ఆ లు కూడా  రావు  ఎవరో సాధు పుంగవులు కలిసి మిగల  పండి వ్యాపారస్తులు బయట పారవేసే  నల్లబడ్డ అరటిపండు తినమని సలహాలు ఇచ్చారు  40 రోజుల మండల దీక్ష  తిన్న తర్వాత అల్సర్ తోపాటు ఆకలి కూడా పోయింది  దానిని గమనించి కొంతమంది రామకృష్ణ లాంటి వారు ఆమెను తమ గ్రామం తీసుకువెళ్లి అక్కడ ఆశ్రమం నిర్మించి స్థిర నివాసం ఏర్పాటు చేశారు  అనేకమంది భక్తులు రావడంతో దానికి మంచి పేరు వచ్చింది.ఆకాశవాణిలో పనిచేసి పదవీ విరమణ చేసిన రాచకొండ నరసింహమూర్తి గారి నేతృత్వంలో సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేసి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో నియమ నిబంధనలతో విద్యార్థులను ఉత్తమ వేదాంత శిరోమణులుగా తీర్చిదిద్దుతున్నారు  అక్కడకు వచ్చిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి  అమ్మ జన్మదినోత్సవానికి ప్రతి సంవత్సరం లక్ష మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఆమె ఎవరికి తన మహత్యాలను ప్రదర్శించదు తన లీలలేమిటో ఎవరికి తెలియదు చూడగానే లక్ష్మీదేవిలా ఎవరికి వారు తమ మాతృమూర్తిని జ్ఞాపకం చేసుకునే స్వరూపం ఆ నాటికి అక్షరాలు కూడా రాని ఆమెకు బ్యాంక్ కోసం అమ్మ అన్న రెండు అక్షరాలు సంతకం కోసం నేర్పారు.


కామెంట్‌లు