మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322.
 స్వామివారి గది గుమ్మం దాటుతూ ఉండగా  నేనేమిటో నేను మర్చిపోయాను  అప్పటివరకు  కోపంగా ఉన్న  ఆ క్షణంలో ఎంతో ప్రశాంతంగా అనిపించింది  స్వామి వారి ఆకారం చూడగానే  నాకు తెలియకుండానే రెండు చేతులు ఒక చోట చేరినై  ఇది వారి శక్తి అనుకోవాలా  నా మనసు నా అధ్యయనంలో లేకపోవడం అనుకోవాలా  నాకేమీ అర్థం కాలేదు  అలా నడుచుకుంటూ స్వామి వారి దగ్గరకు వెళ్లి  హృదయపూర్వకంగా ఎంతో భక్తితో వారికి నమస్కారం చేయడం  నా జన్మలో మొదటి అనుభవం  బయటకు వచ్చిన తర్వాత  ఇలా కూడా జరుగుతుందా  కనుకనే ఇన్ని లక్షల మంది ఎగబడి ఇక్కడికి వస్తున్నారా  నేనింతవరకు తప్పుగా అర్థం చేసుకున్నానా  మనకు తెలియని ఏదైనా ఒక శక్తి  మనలను నడిపిస్తుందా మనల్ని నడిపిస్తుంది మనం కాదా  అన్న ఆలోచనలో పడిపోయాను  నిజంగా నా జీవితంలో అది గొప్ప మార్పు. ఇలా భగవంతుడు లేడు అని చెప్పిన అనేక మందిని తన భక్తులుగా చేసుకున్న ఘనుడు వెంకటేశ్వర స్వామి  శ్రీ వెంకటేశ్వర స్వామి అంటేనే  శ్రీకారం లక్ష్మీస్వరూపం  విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నా లక్ష్మి ప్రకార ఉండి తీరవలసినదే  బ్రహ్మకు సరస్వతి ఈశ్వరునకు పార్వతి ఉన్నట్లుగా  వెంకట అంటే పవిత్రత దానిని విడదీస్తే వ్యేయం అంటే పాపములు  కట అంటే దూరం చేసేవాడు నాశనం చేసేవాడు  ఈషా అంటే ప్రతి అణువులోనూ  ఉండేవాడు  సర్వత్రా తానే  అలాంటి తత్వాన్ని శక్తిని మనం ఒక మూర్తిగా  ఏర్పాటు చేసుకొని కొలుచుకుంటున్నాం  అందుకే ఆ స్వామి విగ్రహం  ఈ ప్రపంచానికి అభయహస్తాన్నిస్తూ  రెండవ చేతితో  తన పాద పద్మములను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని  నేను రక్షిస్తాను అనే హామీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది  ఆ పవిత్రమూర్తిని చూడగానే  ఆధ్యాత్మికంగా కూడా ఏడు  కొండలను  చెపుతూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఈ ఏడుకొండలు ఏమిటి ఎందుకు ఏర్పడ్డాయి  ఒక్కొక్క కొండ  ప్రాశస్త్యం ఏమిటి  అన్న విషయాన్ని మనం చూద్దాం  ఏడుకొండలను  మోస్తున్నది ఏడుగురు  ఏ కొండకు ఏ లాభం ఉంది దానిని ఎవరు పరిరక్షిస్తూ ఉంటారు  అన్నది పురాణ కథలను ఆధారంగా చేసుకుని మనవాళ్లు చాలా విషయాలు చెప్పారు  మనం క్లుప్తంగా చూద్దాం  స్వామి దర్శనం చేసుకోవాలంటే మనం వెళ్లవలసినది మొదట వృషభాద్రి  దగ్గరకు  వెళ్లి అక్కడ చిన్న గుడి ఉంటుంది దానిలో  దైవ దర్శనం చేసుకుని ఆ జ్యోతిని చూసి నమస్కరించి  బయలుదేరాలి  వృషభం అంటే ఎద్దు  ఒక ఎద్దు తన పైన ఉన్న ఆరు కొండలను మోస్తుందా  బండిలో 10 బస్తాలు దాటివేస్తే ఆ బండిని లాగాయి ఆ రెండు కలిసి మరి ఒకటి ఎలా మోసింది అని ప్రశ్నించేవారు ఉండవచ్చు  వృషభము అంటే నందీశ్వరుడు  ఈ ప్రపంచమంతా నిండియున్నది ఈశ్వర స్వరూపం  ఆ ఈశ్వరుని వాహనం ఈ నంది  ప్రపంచాన్నిమోసిన ఆ మహేశ్వనికి  ఆరు కొండలు ఒక లెక్కా.

కామెంట్‌లు