ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నాటకం ఎలా తయారు చేయాలో ఆ నాటకంలో ఏ పాత్రతో ఎలా మాట్లాడాలో  వారితో ఎలా ప్రవర్తించాలో విజయవాడలోనే నేర్చుకున్నారు సి.వి  సూర్యనారాయణ ఆయన పూర్తి పేరు  నండూరి సుబ్బారావు గారిని రామ్మోహన్ రావు గారిని ఉదహరిస్తూ ఈ విషయాలు చెప్తాడు. ఎలా చేయాలో నేర్చుకోవడం విశేషం కాదు ఎలా చేయకూడదు అన్నది వీరిద్దరి వద్ద నేర్చుకున్నాను అంటారాయన  నేను మాత్రం ఎలా చెప్పాలో శాస్త్రి గారి ద్వారా ఎలా చెప్పకూడదో గుర్రం కోటేశ్వరావు గారి వల్ల నేర్చుకున్నాను నా ఆకాశవాణిలో వారే నా గురువులు  బందా గారు ఉన్నంతవరకు నేను వారి నాటకాల్లో కథానాయకుడిని లింగ రాజు శర్మ గారు ప్రతినాయకుడు. అప్పుడు పాత్రల ఎన్నిక పని లాగా చేసేవారు పాత్రలు సాధన చేస్తున్నప్పుడు వారి తప్పులు ఏమిటో బందాగారే చెప్పేవారు దాన్ని సహాయకులుగా నండూరి సుబ్బారావు గారు  రామ్మోహన్ రావు గారు కొనసాగించేవారు నిర్వహణ మాత్రం సహాయకులు అనే పేరుతో నండూరి సుబ్బారావు శ్రీ రామ్ మోహన్ రావు అని చెప్పేవారు. 1962లో మొదటిసారిగా సివి సూర్యనారాయణ భీమవరం నుంచి  15 నిమిషాల నాటిక కోసం వచ్చారు వీరు చెప్పే విధానం నచ్చక ఆ నాటకంలో నటించకుండానే వెళ్లిపోయారు ఇది  కళాకారులతో ఎలా మెడగకూడదు ఆయన ద్వారా నేర్చుకున్నాను అనేవారు. ఒకసారి పౌరాణిక నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం.
దానిలో వెంపటి రాధాకృష్ణ గారు ప్రతినాయక పాత్ర నేను నాయక పాత్ర రామ్మోహన్ రావు గారు నిర్వహణ  నాటకం మధ్యలో ఒక వాక్యం చెప్పడంలో అలా కాదు ఇలా చెప్పమన్నారు రామ్మోహన్ రావు గారు   కాదు నువ్వు చెప్పినట్లే చెప్పు వాడి బాణీ వద్దు అన్నారు వెంపటి రాధాకృష్ణ  వాళ్లంతా ఏక వచనంలోనే సంబోధించుకుంటాడు.వీడికి వెంకటేశ్వర రావుకి, నండూరి విఠల్ కి ఒక జబ్బు వాడు చెప్పినట్లే ఎదుటివాడు కూడా చెప్పాలి ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు  వాడిలో ఉన్న అనుసరించవలసింది అర్థం మాత్రమే భావం చూడకుండా నీ పద్ధతిలో  పాత్రను దృష్టిలో పెట్టుకొని చెప్పు వాడు సాంఘిక నాటకాలు  ఆడడంలో ఘటికుడు కానీ పౌరాణికాలలో కాదు అయ్యప్ప మాత్రం సరిగా చేశాడు రామ్మోహన్ అన్నాడు  వెంపటి.
కామెంట్‌లు