అక్కడ మఠాధిపతి అయిన అను భయనందజీ వారి శిష్యులలో ఒకరు వీరు తీర్థయాత్ర చేస్తూ ఈ క్షేత్రమునకు వచ్చి తపస్సు చేస్తే బావుంటుందని అందుకు ఉపక్రమించారు ఆ కాలం విజయనగరం సాళ్వా వంశపు రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు వీరు క్రీస్తు శకం 1500 సంవత్సరాల అప్పుడు వచ్చినట్టుగా తెలుస్తోంది వీళ్ళు మిగుల తపోనిస్టులు వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడినట్టు కూడా చెప్తారు వీరు ఆకులను తింటూ నీరు తాగుతూ జీవితం కొనసాగించారు. శరీరము తోనే కొంతకాలమునకు అంతర్థాన మైనట్టుగా చెప్తూ ఉంటారు వీరికి చంద్రగిరి రాజు తిమ్మరాజు గారి కుమారుడు శిష్యుడై వీరి తర్వాత మఠాధిపతిగా వచ్చారు.
ఈ రాచ పుత్రుడు శ్రీ హత్తి రాంజీ గారి శిష్యుడు అవడం వల్ల అప్పటి రాజులు వీరి మఠమునకు ఒక సింహాసనమును ఇంకా రాజా చిహ్నమును అగు నౌభత్ కాన గంట మొదలగునవి ఇచ్చారు. తిరుమల మీద ఉండు రాజనగరం మఠంగా మారింది వీరు జపం చేయు మాల ఒకటి మఠంలో ఉంది హతి రాంజీ బైరాగి సాధువు శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచిక లాడాడని ప్రసక్తి వారి మఠం తిరుమలలో ప్రదేశం పరమ పవిత్రంగా బోధించబడుతుంది. ఆయన జపమాల గురించి ఎవరూ చెప్పరు పాద కానుకలు ఏవో కానుకలు ఏవో చాలా చోట్ల ఆస్తులు సంపాదించాడు భవనాలు నిర్మించారు ఆరుగురు మహంతులు 90 సంవత్సరాలు టీటీ దేవస్థానానికి విచారణ కర్తలుగా పనిచేశారు కొన్ని సేవలు చేశారు తమ మఠానికి దేవునితో సమానంగా ఆస్తులు సంపాదించారు తిరుమల మఠాన్ని క్రి.శ 13-3-1819 లో జానకి దాస్ నిర్మించారు.
హతి రామ్ జి శిష్యుడు తిమ్మరాజు (తిరుమల రాయుడు) కొడుకు అన్నారు మఠం పరంపర జాబితాలో హతి రాంజీ శిష్యుడు గిరిధర రాయడు అని ఉంది ఈయన చంద్రగిరి రాజ కుటుంబానికి చెందినవారు. ఇప్పటికీ మఠానికి మహంతి ఉన్నాడు వారేదో నేరాలు చేశారని ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసి తానే అప్పుడప్పుడు మఠంలో పెత్తనం చెలా ఇస్తూ ఉంటారు ఈ మఠానికి అధిష్టానం తిరుమల శ్రీ మహంతువారు సంవత్సరంలో కొంతకాలం తిరుపతిలో ఉంటారు ఈ మఠానికి తిరుచానూరు చిత్తూరు వేలూరు షోలింగర్ వృద్ధాచలం తంజావూరు మధుర నాసిక్ పంచవటి సుగురు బొంబాయి జిల్లా ముంజేరి జిల్లా గుజరాత్ అయోధ్య నాబా మొదలగు ప్రదేశాలలో శాఖలు ఉన్నాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి