ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 లత గారు రాసిన మోహన వంశీ ఆవిడ వ్రాసిన నవలలలో మకుటం లాంటిది రేడియో కేంద్ర నాటకాలు వ్రాసి ప్రసారం చేసి  పాత్రలకు గల అని కూడా అందించారు నండూరి సుబ్బారావు గారికి గొప్ప పేరు తెచ్చి పెట్టిన గణపతి రేడియో అనుసరణ కూడా ఆమె చేశారు  ప్రథమ పర్యాయం  గణపతి రేడియో నాటిక మర్చ బడినప్పుడు దానిని బందా గారు   ఆకాశవాణి పరిధిలో నాటకంగా మలచి నండూరి సుబ్బారావు గారిని సీతారత్నమ్మ గారిని ప్రధాన పాత్రధారులుగా చేసి ప్రసారం చేశారు  ఆ సీరియల్ నాటకం ప్రజల హృదయాలలోకి చొచ్చుకు పోయింది  ఆకాశవాణి కేంద్రం నుంచి మొట్టమొదట ప్రసారమైన సీరియల్ నాటకం  గణపతి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కొంతకాలం జరిగిన తర్వాత  లతగాడు సొంతగా అనువదించి తన నిర్వహణలో  ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు  ఆ తర్వాత కొంతకాలానికి  నండూరి సుబ్బారావు గారు  స్వయంగా అనువదించి తానే ఆ పాత్ర వేస్తూ   దర్శకత్వ బాధ్యత కూడా తానే నిర్వహించారు  మూడు పర్యాయాలు ఒకే సీరియల్  ఓకే కేంద్రం నుంచి ప్రసాదం కావడం అనేది  ఆకాశవాణి కేంద్రాల చరిత్రలో ప్రథమం  ఆ గొప్పతనం మొత్తం ఆకాశవాణి కేంద్రానికి చెందుతుంది  తర్వాత వీ.బి కనకదుర్గ గారు  సంగీతంలో భారత దేశంలోనే ప్రథమ చెప్పుకోబడే  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి  ప్రథమ శిష్యురాలు  వారి దగ్గర  గాత్రం తో పాటు వాయోలిన్ కూడా  సాధన చేసి నేర్చుకొని పరిణతి చెంది విజయవాడ కేంద్రంలో  నిలయ విద్వాంసరాలుగా స్థిరపడింది.
కామెంట్‌లు