మన తిరుపతి వెంకన్న;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 శ్రీ పురం అంటే సిరి, లక్ష్మి  నివాసం ఉండే గ్రామం. ఈ శ్రీపురం అన్న సంస్కృత నామంతో వ్యవహరించబడే తిరుపతి అన్న పట్టణం చెన్నపురి రాజధాని లో చిత్తూరు జిల్లాలోని మునిసిపల్ పట్టణం తిరుపతి  కొండలకు కార్వేటి నగరం జమిందరీలో కొండలను వేరుపరుస్తూ మధ్యన ఉన్న విశాలమైన కనుమలో ఈ పురం ఉంది తిరుమలకు వెళ్లే యాత్రికులు ఎప్పుడూ ఉండడం చేత ఈ పట్టణం జనముతో నిండి ఉంది  ఈ పురం 1886 వ సంవత్సరమున మున్సిపల్ పట్టణంగా నిర్మించబడింది. ఇక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి  ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారినే శ్రీ మహంతు వారి విచారణ కర్తుత్వంలో ఉన్నాయి. కచేరి దేవస్థానం వల్ల నిర్మించబడిన ఆయుర్వేద వైద్యశాల  పాఠశాల సంస్కృత కళాశాల కూడా ఉన్నాయి  ఇంకా మునిసిపల్ ఆసుపత్రి కచేరి జిల్లా మున్సిపల్ సబ్ రిజిస్టర్ పోలీస్ సర్కిల్ కచేరిలో ఉన్నాయి. బాటసారులకు తాలూకా బోటువారి బంగ్లా ఉంది అమెరికన్ మిషన్ హై స్కూల్ కట్టడాలు ఉన్నాయి  ఊరు బయట రీడింగ్ రూమ్ ఉంది యాత్రికుల సౌకర్యార్థం అనేక సత్రాలు ఉన్నాయి  ఇక్కడ తిరుపతి తూర్పు తిరుపతి పడమర అన్న రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి  తిరుపతి తూర్పు యాత్ర ఉంటుంది ఈ స్టేషన్  ఈ గ్రామానికి చేరి ఉంది  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకు వచ్చేయత్రికులు గూడూరు రేణిగుంట పాకాల  కాట్పాడి రైల్వే జంక్షన్ ద్వారా తిరుపతికి రావాల్సి ఉంది  అందుకోసం అనేకమంది జంక్షన్ కు వెళ్లే యాత్రికులు రైలు బండిలో ఉండగానే ఊరి పేరులు హెచ్చరించి తమ బసలకు రమ్మని వేడే వారు. వీరి మాటలు అన్నీ కూడా సద్ బుద్ధితో యాత్రికులు యోచించి విశ్వాసముంచాలి  వీరు ఇండ్లకు వెళ్లిన బసపాత్ర సామానులు ఇప్పిస్తారు.
బియ్యం మొదలైన సామానుల అంగడిలో  కొన్ని సమయాల్లో  జాగ్రత్తగా ఉండాలి. భక్తులు తమతో పాటు తెచ్చిన  ముడుపుల్ని సొమ్ముల్ని భద్రంగా కాపాడుకోవాలి  ఇతరులను నమ్మి ఎవరికి ఇవ్వకూడదు. పుష్ప తోట అనే విశాలమైన దేవస్థానపు సత్రం ఉంది ఎంతో శుభ్రంగా బందోబస్తుగా ఉంటుంది  అంటే గుమస్తా జవానులు ఉంటారు. ఈ సామానులు నాలుగు జాతుల వారికి ఇస్తారు  బండి బాడుగకు అనగా అద్దెకు దొరుకుతాయి  ఇది బజారుకు చేరి కొండకు వెళ్లే మార్గంలో ఉంది  కొత్తపల్లి రామాచారి సత్రం రైల్వేస్టేషన్కు 400 దూరంలో ఉంది  బండి బెడుగు స్టేషన్ నుంచి  కూరగాయలు మార్కెట్ దగ్గరగాను బజారుకు దూరంగానూ శుభ్రంగాను బందోబస్తు గానే ఉంటుంది  ఇది బ్రాహ్మణులకు మాత్రమే చేస్తారు. రామాచారి గారి సత్రంలో పాత్ర సామానులు ఇస్తారు  రెండు సత్రాలలో  కూడా గుమస్తాలు ఉంటారు.


కామెంట్‌లు