శ్రీ శ్రీ బాధ ప్రపంచ బాధ ప్రపంచ బాధే శ్రీ శ్రీ కవిత్వం;-అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
అక్షరానికి అనంతశక్తిని 
ఆపాదించినవాడు

కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది
మనల్ని మునుముందుకు
నడిపించేది
కవిత్వంమని శ్రీ శ్రీ కొత్తగా
నిర్వచించాడు

శ్రీశ్రీ మహాప్రస్థానం
అది లోకాంతర యాత్ర
ఈ భూలోకాంతర యాత్ర

లిమరిక్కులు
ప్రాసక్రీడలు
సిప్రాలి
సిరిసిరిమువ్వ శతకం
ఖడ్గసృష్టి
జయభేరి
పావల
1+1=1
మరియు 
అభ్యుదయ సీనీగీతాలు ఇలా
ఎన్ని వ్రాసిన 
అవన్నీ
పీడితతాడిత బడుగు బలహీనవర్గాలకు బాసటగా
నిలవడంకోసంవ్రాసినవే

శ్రీశ్రీ అంటేనే అతడు
తెలుగు సాహిత్యానికి
బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన
ప్రగతిశీల సాహిత్యకారుడు

అతని రచనా విధానాన్ని
అనుసరించి రచనలు చేసిన
ఆధునిక కవులు ఎందరో
మరెందరో ఇప్పుడు లబ్దప్రతిష్టులు

తన ఆత్మకథ పేరు అనంతం
ఎంత విలక్షణ శీర్షిక ఇది
ఈ శీర్షిక శ్రీ శ్రీ గారి
దార్శనికతకు తార్కాణం

కొంత మంది యువకులు పుట్టుకతో వృద్దులు

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను

ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం

నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహ సిక్తం

అంటూ అలతి అలతి పదాలతో ఎంతో భావగర్భితంగా
వచన కవితాస్త్రాలు సంధించిన
మహాకవి

అభ్యుదయ కవిత్వ సృష్టికర్త
మరింత గాఢమైన పదసాహిత్యానికై
విరసం స్థాపన చేసి 
మార్పు దిశగా కవితా వ్యాసంగం కొనసాగించాడు

శ్రీ శ్రీ బాధ ప్రపంచ బాధ
ప్రపంచ బాధే శ్రీ శ్రీ కవిత్వం


కామెంట్‌లు