వీస్తున్న గాలి;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
యుద్ధంలో 
ఓటమి తథ్యమని తెలిసినా
మౌఢ్యం తలపడుటే రణన్నీతి

రక్తసిక్తం కాకుండా
ఏ మట్టీ ఏ రాజూ గెలిచె సమరాలు
రాజులు పోయినా యుద్ధాలింకా సాగేనిల

అసహనం పాకుడు రాళ్లూ  అశాంతి గీతాలు నానిన చీకిన  మట్టిగోడలు 
ఇక కుటిల కపట చీకటి చేసేదే యుద్ధమైన వేళ 

శుష్క వాగ్ధానాలూ రక్తంలేని రాగాలు
శూన్యనిర్మిత మరీచికేనోయ్

గెలిపించేదే దుడుకు పరుగు యుద్ధంలో
మంచీ చెడూ గాలికే వదిలాక
విదుర నీతి సమాధిలో బస

ఇప్పుడు వీస్తున్న గాలి రంగుమార్చే కండువాలనేగట్టుకు చేర్చునో
జెండాల తీరాలు చేరేది ఏ కలలకో

మనిషికోసం కొట్లాడు
మంచికోసం పోరాడు మనిషిగా
సామాజిక స్వేచ్ఛ కోసం చేసే 
బతుకు యుద్ధమే
ఏ రాజకీయంలేని నిబద్ధ యజ్ఞం  

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Very good reflection of.political climate both in the region and center of the Nation.