ఉగాది - ఆశల విహారి; వెంకట రమణారావు విశాఖపట్టణం -9866186864
వసంత వేడుకల వయ్యారి
ఆశల పురి విప్పిన మయూరి
పచ్చని వలువ కట్టి
కోయిల పలుకులతో
తలుపు తట్టి నిలిచింది
మన ఇంటి ముంగిట

అడుగులో అడుగు వేసి
ఆశల పూల సజ్జతో
పరిమళాల వీవన తో
ఆరు రుచులు రంగరించి
ఆశల దొన్నెలలో
అందరికీ పంచుతుంది
ఊరించే ఉగాది మాధుర్యం 

ఆది లేని కాలానికి 
వసంత హేమంతాలు 
కొలమానంగా 

విహరించే ప్రకృతి కాంత
 విహారం లో
నాంది పలుకు  ఉగాది

కొత్త ఆశలు కోటి  కలలు
క్రొంగొత్త అందాలతో
వస్తుంది ఉగాది
నిత్య నూతన ఉగాది


కామెంట్‌లు