అక్షరాల నిజం!!;- -గద్వాల సోమన్న,9966414580
హృదయ శుద్ధి లేకుంటే
ఆచారాలు వ్యర్థమే!
విలువలే శూన్యమైతే
లేదు జన్మకు అర్థమే!

నిగ్రహ శక్తి లేకుంటే
మనసు అగును భ్రమరమే!
మనశ్శాంతి దూరమైతే
దినదినమూ సమరమే!

బద్దకం అవరిస్తే
అభివృద్ధి గగనకుసుమం
దుర్గుణాలు అలవడితే
శిథిలమగును జీవితం

ప్రేమ ధార ఇంకితే
బంధాలే బీడుబారు
హృదయాలే ఇరుకైతే
మానవత్వం మసిబారు

కామెంట్‌లు