మంచి వ్యాయామం ఈత;- -గద్వాల సోమన్న,9966414580
ఎండాకాలం వచ్చెను
ఎండలు మెండుగా తెచ్చెను
చెట్లు తరిగి భూలోకం
అగ్ని గుండంగా మారెను

గ్రీష్మ తాపంతో పిల్లలు 
వంకలు,చెరువులు చేరిరి
నీటిలో దూకి ,ఆడుతూ
కడు ఉపశమనం పొందిరి

ఈత కొట్టుచూ  కేకలు
వేయుచూ సంతసించిరి
ఈత ఆరోగ్యానికి
ఘన వ్యాయామని తలచిరి

చూడు చూడు నీటిలోన
పిల్లలు చేసే సందడి
నీళ్ళంటే భలే ఇష్టము
ఈత వలన ఉంది లాభము


కామెంట్‌లు