ముక్త పద గ్రస్త గేయం;- -గద్వాల సోమన్న,9966414580
రాజే నాడు రైతు
రైతు ఉంటే మెతుకు
మెతుకు ఉంటే బ్రతుకు
బ్రతుకు కాదులె అతుకు

చూడు రైతుల అప్పు
అప్పు బ్రతుకున నిప్పు
నిప్పు వలనే ముప్పు 
ముప్పు వద్దని చెప్పు

ముఖ్యమైనది చదువు
చదువుతోనే కొలువు
కొలువు ఉంటే సుఖము
సుఖము లేక కష్టము

చదువు బాపును భ్రాంతి
భ్రాంతి తొలగిన కాంతి
కాంతిలోనే శాంతి
శాంతియే సంక్రాంతి

కామెంట్‌లు