అలుపెరగని ఆదర్శవంతులు;- -గద్వాల సోమన్న,9966414580
జలజల పారే యేరుల్లారా!
మిలమిల మెరిసే తారల్లారా
అలసత్వం లేశమైనా లేని
గలగల ధ్వనించు మువ్వల్లారా

పెళ పెళ ఉరిమే ఉరుముల్లారా!
తళతళలాడే మెరుపుల్లారా!
సోమరితనం ఏమాత్రమెరుగని
కళకళలాడే చెరువుల్లారా!

చకచక నడిచే పిల్లల్లారా!
పకపక నవ్వే కూనల్లారా!
నిండు పున్నమిలా విందులు చేసే
తికమక పడని చిన్నారుల్లారా!

జగతిలో ఆదర్శవంతులు మీరు 
ప్రగతిలో సాటి మీకు ఎవరు లేరు
పరోపకారమే చూపుట మీ తీరు
హానికరం అసలు కానే కారు


కామెంట్‌లు