బహు బంధాలు...;- -గద్వాల సోమన్న,9966414580
ఎన్నెన్నో బంధాలు
పెనువేయును జీవితాలు
సమాజాన సంబంధాలు
సృష్టిలోని విచిత్రాలు

స్నేహమనె ఈ బంధము
ఆత్మీయ అనుబంధము
అవనిలోన అపురూపము
చూడంగా మణిదీపము

అన్నాచెల్లెల బంధము,
అక్కాతమ్ముని బంధము
ఇలా ఎన్నో బంధాలు
అమ్మానాన్నల బంధము

గురుశిష్యుల సంబంధము
తిలకింప కడు పవిత్రము
బంధాలే లేనిచో
మనిషి మనుగడ శూన్యము

కామెంట్‌లు