ఇంటి దీపం ఇల్లాలు;--గద్వాల సోమన్న
 పల్లవి:
లాంతరును వెలిగించిన చేతితో
కుటుంబాన్ని వెలిగించును మహిళ
ఇంటి దీపం ఇల్లాలే మరువకు
జీవితాన ఆధారం చివరకు
1.
సదన కోవెలలో ఇంతి దేవత
సక్రమంగా నిర్వర్తించు బాధ్యత
గౌరవానికామెకుంది అర్హత
స్త్రీ మనుగడకై పూనుము అంచేత


2.
లాంతరు వెలుగులో చీకట్లు దూరము
నాతి ఉన్న గృహమగును స్వర్గధామము
మగువ త్యాగము మహోన్నతము
అడుగడుగునా ఆశీర్వాదము
3.
అవనిలోన అమూల్యము వనిత
ఉన్నత స్థానం కల్పిస్తే ఘనత
అబల కాదు సబల అన్నింటిలో
భగవంతుడు గొప్ప చేసెను సృష్టిలో

కామెంట్‌లు