గగనపు వేదికనుండీ
అవనీతలము పైకి
దిగివచ్చు కిరణాల
వెలుగు ధారల వెంట
జిలుగు దారాలతో అల్లిన
పసిడిరంగు చీరను
సారెగ సూరీడు
పుడమితల్లికి
పంపిన కానుకేమో!!
సప్తవర్ణాల అందాలు
చీరకొంగున నేసిన
నేతగాడెవరా అని
పూత పూసిన తోట
మొత్తము చిత్తరువై
నిలిచి చూసే తరుణాన
అరవిరిసిన కుసుమబాల
అమాయకంగా నవ్వుతూ
జగమెంత అందమైనదో అని
మురిసి పోతున్నదేమో!
ఆగమించు బాలుని
కాంచన వీక్షణాలు
పృధ్విని ప్రసరించి
కొత్త కోరికల వెంట
పరుగులు తీయు మనసుకు
ఉత్సాహము కలిగించి
ఉర్వినంత జీవచైతన్యము
నింపు వేకువ వెలుగులు
చక్కని మధురక్షణములు
తెచ్చునని నమ్మకమేమో!
అతిశయమైన ఆనందమిచ్చు
అందమైన ఉదయానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి