శ్యామశాస్త్రి ;- కొప్పరపు తాయారు
 ఈయన అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యం. తంజావూరు జిల్లాలో తిరువారూర్ వూరు గ్రామంలో
జన్మించారు. ఏప్రిల్ 26 1763 న, కృత్తికా నక్షత్రంలో.
తల్లిదండ్రులు ముద్దుగా "శ్యామకృష్ణా" అని పిలుచుకునేవారు. ఇదే ఆయన కీర్తన లలో ముద్రయింది. 
           ఈయన బంగారు కామాక్షి ఉపాసకులు.
అమ్మపై తప్ప వేరొకరిపై కీర్తనలు ఈయన చేయలేదు. అపూర్వ రాగాలు సృష్టించారు. త్యాగరాజ స్వామి ఈయన యొక్క  లయ జ్ఞానములను పొగిడారు.
                      ఈయనకి ఆనందభైరవి రాగము అంటే చాలా ఇష్టం. ఆంధ్ర గీర్వాణ భాష కోవిదుడు. 
చాలా ప్రఖ్యాతమేనా కీర్తనలు, స్వరజితులు         ఈయన రచించారు.
         ఇప్పటికీ ఆ గానామృతం లో ప్రతి ఒక్కరూ తేల్తూనే ఉన్నారు.


కామెంట్‌లు