కడుము హైస్కూల్ లో పది ఫలితాలు భేష్

 పదోతరగతి ఫలితాల్లో 600మార్కులకు 574మార్కులు సాధించిన విద్యార్ధిణి కిల్లారి దీప్షిక శ్రీ తమకెంతో గర్వకారణంగా నిలిచిందని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
మంచి ఫలితాలు సాధించిన పిల్లలను అభినందించే సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
574 మార్కులు పొంది తమ పాఠశాల ప్రథమ ర్యాంకు పొందిన దీప్షిక శ్రీ తో పాటు, 567, 566, 549 మార్కులతో ద్వితీయ , తృతీయ, చతుర్ధ స్థానాలలో నిలిచిన సింహాద్రి యామిని, కిల్లారి లావణ్య, బూరాడ హారిక లను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. అలాగే 500 పైబడి మార్కులు పొందిన 11 మందిని మిగతా ఉత్తీర్ణులైన వారిని కూడా శుభాకాంక్షలు తెలిపి, ప్రశంసించారు. 
పాఠశాలలో 70మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 61మంది ఉత్తీర్ణత సాధించారు. 87శాతం ఉత్తీర్ణులైన వీరందరినీ ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిలి శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబి కుమార్ మహా పాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు అభినందించి హర్షం వ్యక్తం చేసారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు