సుప్రభాత కవిత ; - బృంద
లోకమంతా వెలుగు నింపి
చీకటికి సెలవు ఇచ్చి
అవనిలో అణువణువూ 
నవచేతన ప్రసాదించి..

నవనవోన్మేషమైన 
కిరణాల ప్రసరించి
నులివెచ్చని చేయందించి
మేదినికి మేలుకొలుపుగా

ఉదయరాగ వాహినిలో
హృదయాలకు ఊపిరిగా
చేదు కలల కలతల
భయాలను నయంగా  తొలగిస్తూ..

జీవిత చిత్రపు దారులలోని
ఒడిదుడుకులు ఒడుపుగా
తప్పించుకుని నేర్పుగా 
బ్రతుకు బండి నడిపే నైపుణ్యమిస్తూ..

అనుభవాలన్ని గురువులుగా
వైఫల్యాలు సాఫల్యాలుగా
ప్రతి ప్రయత్నమూ ఒకో మెట్టుగా
ప్రతి దినమూ ఒక పరీక్షగా...

కొత్త  ఆలోచనలతో
కొత్త పరిష్కారాలతో కొంతైనా 
దూరం తగ్గించుకుని చింతలేక

 చకచకా నడిచే ఊపునిస్తూ...

కణకణమూ ఉత్సాహం నింపి
అణువణువూ ఉత్తేజితం చేసి
అడుగడుగూ అప్రమత్తంగా ఉంటూ
దినదినమూ తోడుగా చేయూతనిచ్చే

కొత్త ఉదయానికి

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు