కీర్తి పట్నాయక్ మజ్జిగ పంపిణీ

 తాను స్థాపించిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కీర్తి పట్నాయక్. 
మురళీనగర్, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో రోజంతా తన సొంత ఖర్చులతో మజ్జిగ పంపిణీ చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే కృషి చేస్తున్నారు కీర్తి పట్నాయక్.
ఈ సందర్భంగా కీర్తి పట్నాయక్ మాట్లాడుతూ 
సూర్యుని భగభగలతో ఉదయం ఎనిమిది గంటల నుండే  విపరీతమైన వేడివలన జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతం కంటే నేడు చాల ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయని, సాయంత్రం ఐదు గంటల వరకు వీలైనంత బయటకు వెళ్లకపోవడమే మంచిదని అన్నారు. రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తాగాలని,  సగ్గుబియ్యం జావ, బార్లి, పల్చని మజ్జిగ,  కోబ్బరిబొండాలు తాగాలని, శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాలు, ఆహారం మాత్రమే తీసుకోవాలని,  కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ వలన ప్రయోజనాలు వుండవని హెచ్చరించారు. 
డీ హైడ్రెషన్ నుండి బయటపడేందుకై పెరుగు చాలా దోహదపడుతుందని, పెరుగు అన్నం తినడం చాల మంచిదని, ఒంట్లో వేడిని తగ్గించేటి మజ్జిగ తాగడం మంచిదని ఆమె అన్నారు.  పెరుగన్నం ఎలక్ట్రో లైటులు,  డీహైడ్రెషన్ నుండి కాపాడుతుందని అన్నారు. జాగ్రత్తలు పాటించని ఎడల శరీరంలో వేడి పెరిగి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలౌతుందని కీర్తి పట్నాయక్ తెలిపారు.  బయటకు వెళ్లినప్పుడు గొడుగు  వేసుకుని వెళ్లడం చాల మంచిదని, నూలు వస్త్రం  ముఖానికి కట్టుకోవాలని అన్నారు. 
పండ్ల రసాలు, పుచ్చకాయ ముక్కలు తరచు తీసుకోవాలని ఎందుకంటే, పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ వుంటుందని,  వాటి వల్ల డీహైడ్రెషన్ కి గురి కాకుండ వుంటారని పాదచారులందరికీ వివరించారు.
తాటి ముంజెలు తినడం వలన  శరీరానికి చల్లదనం వస్తుందని, వాటిలో కూడ నీటి శాతం అధికంగా వుంటుందనీ,
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయని కీర్తి పట్నాయక్ అన్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరమని, ఈ ఎండలకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం వుందని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఎక్కువ శారీరక శ్రమ చేసినవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ వడదెబ్బకు గురి కాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
వడదెబ్బ లక్షణాలైన 
కండరాల తిమిరెక్కటం,  
భారీగా చెమటలు పట్టడం, విపరీతమైన బలహీనత,  తలనొప్పి, వాంతులు రావడం చిరాకుగా వుండటం వంటి లక్షణాలను బట్టి వెనువెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె వివరించారు.
కామెంట్‌లు