ఎందుకో ఏమో?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వెన్నెల
వీడాలనుకోవటంలేదు
నిద్దుర
పోవాలనుకోవటంలేదు

పువ్వును
నలపాలనుకోవటంలేదు
కాళ్ళతో
తొక్కాలనుకోవటంలేదు

సోమరిని
అవుదామనుకోవటంలేదు
జూదరిని
కావాలనుకోవటంలేదు

స్నేహాన్ని
విడిచిపెట్టాలనుకోవటంలేదు
మౌనాన్ని
దాల్చాలనుకోవటంలేదు

చీకటిని
కోరుకోవటంలేదు
అక్రమాలకు
ఒడిగట్టాలనుకోవటంలేదు

పస్తులు
ఉండాలనుకోవటంలేదు
ఆస్తులు
కూడగట్టుకోవాలనుకోవటంలేదు

ప్రేమను
త్యజించాలనుకోవటంలేదు
కోపమును
వ్యక్తపరచాలనుకోవటంలేదు

పొగడ్తలకు
పొంగిపోవాలనుకోవటంలేదు
విమర్శలకు
భయపడానుకోవటంలేదు

కలమును
పట్టకూడదనుకోవటంలేదు
కవితలను
కూర్చకూడదనుకోవటంలేదు

కామెంట్‌లు