సుప్రభాత కవిత ; -బృంద
చింతలు లేని చిన్ని ద్వీపం
అందాలు చిందే స్వరూపం
ఆనందాలకు నిలయం
లేదచట ఏ మాయాజాలం.

రోజూ వచ్చే మిత్రుడే దైవం
పచ్చగ మెరిసే ప్రకృతే కోవెల
అన్నం పెట్టే పంట పొలమే గృహం
చుట్టూ కాపలాగా రక్షించే జలం

కన్నుల పండుగేనట అచట
ఎటు చూసినా ఆనందతాండవమట
ప్రశాంతంగా విశ్రాంతి కోసం
మది కోరే మధుసీమ అదేనట

స్వార్థం కోపం ఈసు అసూయ
దరిచేరనివ్వని జీవితం
ఆనందమే అడుగడుగూ
మకరందమే క్షణక్షణమూ..

కలయో నిజమో కానీ
ఏకాంతంలో ప్రశాంతం
వేసవి విడిదిగ మాత్రం
భూతల స్వర్గమే నట..

కొత్త ఊహలు ఊరించే వేకువకు
స్వాగతమంటూ...

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు