కాలం(నానీ లు)-:సి.హేమలత-: పుంగనూరు
1️⃣బీరువా తెరిచాను
యధాలాపంగ
ఉత్తరమై పలుకరించె
గతకాలం

2️⃣సుమశరాలు
తగిలే కవి హృదికి
కాలం ఒడిలో 
కవితలు పండె

3️⃣మనసుకు తగిలిన
గాయం
కాలమనే లేపనంతో
మాయం

4️⃣మోసం చేసి
బతకాలనుకున్నా
గురువై గుణపాఠం
నేర్పెను కాలం

5️⃣పొగిలి ఏడుస్తోంది
కాలం
అరాచకాలకు 
సాక్ష్యం తానేనని
కామెంట్‌లు