*బాల కథకులకు బహుమతి ప్రదానం

 సిద్దిపేటకు చెందిన సుగుణ సాహితీ సమితి వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని  సిద్దిపేట జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి 270 కథలు రావడం జరిగింది.  ఆ పోటీలలో విజేతలకు సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆ పోటీల్లో ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్న  చిన్నకోడురు మండలం, జి.ప.ఉ.పా . రామంచకు చెందిన 8వ‌,తరగతి విద్యార్థి  పి.అభిరామ్ కు తొగుట మండల విద్యాధికారి సత్తు యాదవరెడ్డి, సుగుణ సాహితీ సమితి కన్వీనర్ బైతి దుర్గం,   చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. తమ పాఠశాల విద్యార్థి కథల పోటీలో ప్రోత్సాహక  నగదుబహుమతి పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ...
 విద్యార్థికి పాఠశాల ప్రధానోపాధ్యాయు సత్తవ్వ,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు