శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
616)స్వంగః -

మంచి అంగములున్నట్టివాడు 
స్వకీయమైన రూపమున్నవాడు 
ఆజానుబాహుడై యున్నవాడు 
దేవతా శరీరమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
617)శతానందః -

అసంఖ్యాక ఉపాధులున్నవాడు 
వాటితోడి ఆనందించువాడు 
పూర్ణ సంతోషమొసగునట్టివాడు 
పలుమోదములకు కారకుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
618)నందిః -

పరమానంద స్వరూపుడైన వాడు 
శివునికి ప్రియమైయున్నవాడు 
సాధుస్వభావము గలిగినవాడు 
బసవరూపము ధరించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
619)జ్యోతిర్గణేశ్వరః -

జ్యోతిర్గణముల ప్రభువైనవాడు 
దైవ సేనాగణాధిపతైనవాడు 
సమూహముకు ముఖ్యమైనవాడు 
ప్రథముడై వెలుగొందుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
620)విజితాత్మ-

మనస్సును జయించినవాడు 
చపలత్వమునోడించినట్టి వాడు 
మనో స్వాధీనత కలిగించువాడు 
విజితాత్ముడై విలసిల్లువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు