రాజాం రచయితల వేదిక సభ్యులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ఉగాది వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కారాన్ని స్వీకరించారు.
విజయనగరం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సంఘం "వాగ్దేవి సమారాధనము" ఆధ్వర్యంలో, సంస్థ అధ్యక్షురాలు డా.పెన్నేటి స్వప్న హైందవి అధ్యక్షతన నిర్వహించిన ఉగాది ఉత్సవాల వేదికపై తిరుమలరావుకు, ఈ వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కార సత్కారార్చన జరిగింది. గత ముప్పదైదేండ్లుగా నిరంతరం విద్యార్థుల చదువుల స్థాయిని పెంచేలా బోధిస్తూ, పాఠశాలకు సర్వతోముఖాభివృద్ధిని చేకూర్చుతూ తిరుమలరావు తనదైనశైలిలో కృషి చేస్తున్నందుకు
విద్యారంగానికి గాను ఆయనకు వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కార ప్రదానం గావించారు.
విజయనగరంలో జిల్లా గురజాడ గ్రంథాలయం మేడపైన
క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవ వేదికపై తిరుమలరావు, ఈ గౌరవాన్ని పొందారు.
వాగ్దేవి సమారాధనము అధ్యక్షురాలు డా.పి.స్వప్నహైందవి, గౌరవాధ్యక్షులు ధవళ సర్వేశ్వరరావు, శ్రీ విద్యాపీఠం సనాతన గురుకులాశ్రమ పీఠాధిపతి
యనమండ్ర వేణుగోపాలశాస్త్రి, కళావాచస్పతి జె.వి.తిరుమలాచార్యులు, పంచాంగశ్రవణకర్త బ్రహ్మశ్రీ తనికెళ్ళ వేంకట నాగ ప్రభాకరశాస్త్రి,
గౌరవ సలహాదారులు ముళ్ళపూడి సుభద్రాదేవి, జి.తిరుపతిరావు, కరణం శంకరరావు, బి.సూర్యలక్ష్మి తదితర కార్యవర్గ సభ్యులు తిరుమలరావును శాలువా, ప్రశంసాపత్రం, పూలమాల జ్ఞాపికలతో సన్మానించి పురస్కార ప్రదానం గావించారు.
తిరుమలరావు ఉగాది వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కార సత్కారార్చన పొందుట పట్ల
రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, బాలసాహితీవేత్త రావిపల్లి వాసుదేవరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి