సుప్రభాత కవిత ; -బృంద
రేయి రాలిన పూలతోటి
హాయిగొలుపు రహదారి
మురిపించే రంగుల పువ్వులతో
మైమరపించే  కొమ్మల గాలి!

కనులకింపైన పూల కాంతులు
మరపించును అన్ని కలతలు
నడిపించును ఆనందంగా
తడిపేస్తూ పూవుల జల్లు!

అల్లంత దూరాన ఆకాశంలో
అద్భుతమేదో జరుగుతుందని
నిశిరాతిరి వేచిన కనులకు
కబురేదో అందినట్టూ.....

చేతికి అందేలా తేలే 
మబ్బులు తెచ్చిన సందేశం
వేచి వున్న వేకువ రాక
త్వరలోనే అంటూ దోబూచులు

వేదనెంత వేధించినా
వేడుకెంత సంతోషమిచ్చినా
కాబోదు ఏ క్షణమూ శాశ్వతం
చీకటి వెలుగుల తీరు ఈ జీవితం.

గతమెంత బాధించినా
మార్చడం కుదరదు
భవిష్యత్తు  ఎలా వుండునో
ఊహించ వీలులేదు....

ప్రతిరోజొక అవకాశం
ప్రతి ఉదయం ముదావహంగా
మార్చుకునే మనసుంటే
పయనమెంతో సులభమే!

ఆహ్లాదంగా ఆదిత్యుని ఆహ్వానిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు