611)శ్రీకరః -
శుభములు ప్రసాదించుచున్నవాడు
శ్రీకరమగు తత్వముగలవాడు
ఆత్మను నింపగలిగినవాడు
భక్తులను అనుగ్రహించువాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
612)శ్రీయః -
మోక్షస్వరూపమైయున్న వాడు
శ్రేయోభిలాషిగానున్నట్టివాడు
శ్రీకరమైన రూపమున్నవాడు
సర్వవిధముల రక్షణజేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
613)శ్రీమాన్ -
సర్వవిధముల శ్రీమంతుడైనవాడు
సంపదలు నిండియున్నవాడు
మనోజ్ఞమై యలరించువాడు
ఒప్పిదము గలిగినట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
614)లోకత్రయంశయః -
ముల్లోకాలకు ఆశ్రయమైనవాడు
భువనములు తనలోనున్నవాడు
త్రిలోకములను భరించువాడు
లోకత్రయం శ్రయుడైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
615)స్వక్షః -
చక్కని నేత్రములున్నవాడు
కమలలోచనుడు పేరున్నవాడు
విశాలనయనములున్నవాడు
భక్తులను సదా చూచుచున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి