అంతర్జాతీయ ప్రశంస పత్రాలు అందుకున్న తడపాకల విద్యార్థులు.
 కెనడా దేశం కేంద్రముగా      తెలుగు తల్లి మరియు గడుగ్గాయి పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన  ఊ కొడతారా. బుజ్జాయిల కథలు అనే అంశంపై గత వారంనిర్వహించిన అంతర్జాల వేదికలో 15 దేశాల నుండి 150 మంది విద్యార్థులు పాల్గొనగా  తడపాకల్ పాఠశాల విద్యార్థులు 10 మంది పాల్గొని చక్కని కథలు వినిపించారు.అక్షయ,వైష్ణవి,రిషిత,హరిణి, రింశా,సుశాంత్, అయాన్,వరుణ్, విజ్ఞాత్రీ,చెప్పిన కథలు అందరినీ అలరించాయి.వీరికి కార్యక్రమ నిర్వాహకులైన  లక్ష్మీ రాయవరపు కెనడా గారు, శోభ వేదాంతం గారు విద్యార్థులకు చక్కని ప్రశంసలు అందజేశారని. అదేవిధముగా ప్రశంస పత్రాలను అందజేశా రని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. అంతర్జాతీయంగా తడపాకల పాఠశాలకు చక్కని పేరును తీసుకువచ్చిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావిద్ గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్,కృష్ణ ప్రసాద్, రాములు , నాగప్ప,రవి,నరేందర్,గంగాధర్,సుజాత,విజయ  పాల్గొన్నారు.
కామెంట్‌లు