శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
586)శుభాంగః -

మనోహర రూపమున్నవాడు 
దివ్యములైన అంగములున్నవాడు 
మంగళరూపములో గలవాడు 
శుభకరపు ఆకృతి గలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
587)శాంతిదః -

శాంతిప్రసాదకునిగా నున్నవాడు 
నిమ్మళంగానుంచుచున్నవాడు 
నిర్భయత్వమునీయగలవాడు 
ప్రశాంతత నొసగుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
588)స్రష్టా -

సృష్టికి ఆరంభకుడైనవాడు 
జీవులనుత్పత్తి చేయువాడు 
ప్రాణములు పోయుచున్నట్టివాడు 
సృజనకారుడైయున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
589)-కుముదః -

భూమియందు సంతోషించువాడు 
తెల్లకలువల వంటివాడు 
కుముదనామముగలిగినవాడు 
భూమిలో భాసిల్లుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
590)కువలేశయః -

భూమినిచుట్టియున్నవాడు 
సముద్రములో నున్నట్టివాడు 
జలధి శయనమున్నట్టి వాడు 
కువలేశయుడై యున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు