సుప్రభాత కవిత ; - బృంద
నందనవనమంటి
ఉద్యానవనములో
రాలుపూల రహదారి
ఆహ్లాదకరమేగా!

బృందావనమిచ్చే
హృదయానందంలా
చల్లని నీడనిచ్చే తోట
ఆనందకరమేగా!

మనసుదోచే మధువనంలో
మమతలు పంచే మకరందాలు
మైమరపించే హాయినిస్తే
అద్భుతమేగా!

నిరంతరం నిలిచివుండి
తరంతరం కాపాడే
తరూ సంపద పెంచడం
అవసరమేగా!

నయనానందమైన ప్రకృతి
అందాలు మనోల్లాసాన్ని
కలిగించి మురిపించడం
అతిశయమేగా!

పూలవానలో తడుస్తూ
నీలి నింగి గొడుగు కింద
తేలిపోయే మబ్బులైతే
అపురూపమేగా!

చిన్ని మనసుకు వన్నె పెంచే
కొన్ని వరాల మూటలు తెచ్చే
అరుణోదయాన్ని వీక్షిస్తే
అబ్బురమేగా!

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు