తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే నిరాశ నిస్పృహలతో చాలా మంది పిల్లలు మనరాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు.ఆవార్త చదివాక అందరికీ భయం పట్టుకుంటుంది.ఇక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా వస్తాయి.విచిత్రం ఏమంటే ఓ40 ఏళ్ల క్రితం దాకా బడి కాలేజీ పిల్లలు ఫెయిలైతే ఇలా అఘాయిత్యాలు ఆత్మహత్య ఇంట్లోంచి పారిపోవడం చేసేవారు కాదు.పైగా ఏడాది పొడుగుతా ఖాళీగా ఉండి మళ్లీ మార్చి సెప్టెంబర్ లో పరీక్షలు రాసేవారు.ఒక ఏడాది నష్టపోయేవారు.తను 6వక్లాస్ లో ఉంటే క్లాస్ మేట్స్ 7 లోకి వెళ్లి ఓఏడాది సీనియర్ ఐనా బాధపడటం చిన్నతనంగా భావించేవారు కాదు.ఇప్పుడు ఒక నెల వ్యవధిలో తప్పిన సబ్జెక్టు లో ఫెయిలైతే పరీక్షలు పెట్టి ఏడాది వృధాపోకుండా చేస్తూ ఉన్నా ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టం.
గౌరవ్ అనే పిల్లాడు కలకత్తాలో 2002 లో మేడపై డాబాలో ఆడుతూ ఉండగా11వేల ఓల్టేజ్ కరెంట్ తీగ తగిలి రెండు చేతులు కోల్పోయాడు.తండ్రి ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు.పాపం పిల్లాడు బతకాలంటే రెండు అరచేతులు తొలగించినా  గౌరవ్ పెయింటింగ్ వేస్తూ డబ్బు సంపాదించడం నేర్చుకున్నాడు.మొదట్లో నోట్లో బ్రష్ పట్టుకుని వేసేవాడు.కానీ ఇప్పుడు ఆ మొండి చేతులతో బ్రహ్మాండమైన చిత్రాలు గీస్తూ అదీ కేవలం 10_15 నిముషాల్లో పెళ్లిళ్ళకు గూడా వేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.మరి ఇప్పుడు చెప్పండి? పరీక్ష తప్పితే చావాలా? 🌹
కామెంట్‌లు