మా స్వాగత మిదే గైకొనుమా,!- కోరాడ నరసింహా రావు..!
 ప్రభవ ఆదిగా...తెలుగు నేలన అరువది , వత్సరములు... 
 ఒకటి తదుపరి వేరొకటి.... 
 మరల - మరల పునరావృత మగుచు.... ।
 ప్రతీ వసంతము ఉగాదిగా... 
 యు గాది నుండే జరుపు చున్నా ము...!! 
 ఎండి వాడిన వనములు అన్ని
 పచ్చ దనపు మిస - మిసలతో
ఆకులు తొడిగి, పూవుల నిండి
కోయిల కుహు - కు హు రవములతో... 
 ఆరు ఋతువులకు ప్రతీక గా
 షడ్రుచుల  జీవితాను భవములనూ అనుభ వించకతప్పదని...ఉగాదిపచ్చడి స్వీకృతితో మన సమ్మతిని తెలియ జేయుదుము....! 
  మన స్వాగత సత్కా రములను గై కొని... 
 తమ నామ మహిమ ను 
   చూపించు కొని... 
 మంచి - చెడుల ఫలితములు
 సుఖ - దుఃఖముల అనుభవ మొసగి... మరలి పోవును ప్రతి వత్సరము....! 
  ఆ తీరు గనే వచ్చుచున్నది.. 
 క్రో ధి నామ వత్సరము..., 
 కేవల సుఖ ములనె ఆసించెడి
 మాపై  క్రోధమును చూపించకుమమ్మా..., 
 అపసవ్యపు ఆకాల వర్ష ములు, వింత రోగములు, కష్ట, నష్ట ములపై ... నీ క్రోధ మునుజూపి  అనుగ్రహించుముు నవ వత్స రమా...! 
 ఓ క్రోధి నామ వత్సరమా.... 
 మా స్వాగత మిదే... గై కొనుమా....!! 
   ********
కామెంట్‌లు