భక్తిప్రవృత్తులు- సి.హెచ్.ప్రతాప్

 భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది.భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాముక్తిని పొందేందుకు భక్తి ఒక మార్గము. జీవునికి , దేవునికి మధ్య వారధి భక్తి . కాల ప్రవాహానికి ఒడిదొడుకులకు అతీతమయినది భక్తి . హిందూధర్మ సంస్కృతిలో భక్తి గురించిన విశేషాలు అనేకానేకము ఉన్నాయి . సాధకులు, ఆరాధకులు ఏ విధంగా ఉండాలో మనకు నారద భక్తి సూత్రాలు విపులీకరించాయి. భక్తి తో తన ఇష్ట‌దైవాన్ని ఆరాధిస్తే మనఃశ్శాంతి కలుగుతుంది . మనసులో చెడు ఆలోచ‌నలకు తావుండదు . సన్మార్గ‌ములో నడిచేందుకు వీలుపడుతుంది ణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం… అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో… ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి.భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి  అంతర్లీనంగా ఉంటుంది.భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది.  సృష్టిమూలాన్ని మీరు గ్రహించలేరు, కాని దానితో మీరు ఏకం కాగలరు. భక్తి యొక్క తత్వం అదే.భక్తి అనేది మరో విధమైన మేధస్సు. మీరు తెలివితో గ్రహించలేని దాన్నికూడా భక్తితో గ్రహించగలరు.మీ ఉనికి భక్తిలో మునిగిపోయినప్పుడు, ఓ రాతి ముక్క కూడా మీకు దైవమవుతుంది.మేధోపరంగా విశ్లేషించే వ్యక్తికంటే, ఒక భక్తుని అనుభూతి ఎంతో మెరుగైంది, ఎందుకంటే భక్తి సమస్త విశ్వాన్నీ హత్తుకునే మార్గం.అని భక్తి గురించి సద్గురు జగ్గీవాసుదేవ్ అత్యద్భుతంగా చెప్పారు. 
కామెంట్‌లు