'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 91.
ఉత్పలమాల
దుర్మద మత్సరాదిగుణ దోషములన్ విడనాడి చేరితిన్ 
నిర్మద సాధు సజ్జనుల నిష్ఠగ గొల్చుచు వారిచెంత నే
కర్మ దొలంగు మార్గము గానెడి బోధల నాలకించితిన్ 
నిర్మల తత్త్వమున్ దెలియ నెమ్మదిఁ జేసెద సాధనల్ హరీ!//

92.
ఉత్పలమాల.
జాగును సేయకో వరద!జాఱెడు కాలము నిల్వబోదయా!
దాగుడుమూతలేల? పరితాపము నొందుచు క్రుంగిపోయితిన్
నీగుణగానమున్ సలిపి నీదయఁ గోరితి దీనబాంధవా!
వేగమెరావ నాదరికి!పెద్దవు కావ జగంబుకున్ హరీ!//

కామెంట్‌లు