నేడు మాయలు మంత్రాలతో రోగాలు నయం చేస్తాంఅన్న తాంత్రికులున్నారు.దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చెలామణి అవుతూ డబ్బు గుంజే బడాబాబులున్నారు.కానీబ్రెజిల్ కి చెందిన జోస్ అరిగో అనే వ్యక్తిని డాక్టర్ ఫ్రిట్జ్ ఆత్మ ఆవేశించి ఎలాంటి మత్తు ఇవ్వకుండా జేబులోని చిన్న కత్తితో ఆపరేషన్ చేసేవాడుట!? అలా అతను చేసిన ఆపరేషన్ ని రీల్ లో ఫిల్మ్ గా తీశారు.ఇన్ఫైక్షన్స్ ఎలాంటి సమస్యా లేకుండా 1500 ఆపరేషన్లు చేసిన అద్భుత వ్యక్తి అతను.చిన్న గదిలో కుర్చీ బల్ల తప్ప ఏమీ ఉండేవి కావు.ఎవరూ చనిపోలేదు.ట్యూమర్లు తొలగించే వాడు.ఇది సైకిక్ సర్జన్ ట్రీట్మెంట్ గా ప్రపంచంలో ఖ్యాతి గాంచింది.అతను మెడికల్ సర్జికల్ శిక్షణ పొందలేదు.తన కుడి చెవిలో డాక్టర్ ఫ్రిట్జ్ స్వరం విన్పడ్తూ ఉంటే అలా తాను వింటూ చేతులు కదిలిస్తానని చెప్పేవాడు.ఇప్పటికీ తేలు పాముమంత్రాలు వేసి బాధ తగ్గి పోయేలా చేసే మహానుభావులు ఉన్నారు.నాకు బాగా పరిచయం ఉన్న ఓ అమ్మమ్మ గారు తేలు కుట్టి ఎవరైనా తనదగ్గరకి ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇనుప మేకుని మట్టిలో గుచ్చి కొద్ది కొద్దిగా పైన సుత్తి తో కొడుతూ లోలోన మంత్రాలు చదువుతూ ఉండేవారు.ఆవ్యక్తి తన చేత్తో ఆతేలు కుట్టిన భాగాన్ని చేత్తో గట్టిగా విదిలిస్తూ ఉండేవారు.అంతే అరగంట లో బాధతగ్గి నవ్వుతూ వెళ్లి పోయేవారు.ప్రతి సూర్య చంద్ర గ్రహణ కాలం లో ఆమె చాలా నిష్ఠగా ఈ మంత్రాలు దిష్టి మంత్రాలు పఠించేవారు.దిష్ఠి మంత్రం చదువుతూ బాగా ఆవలించేవారు అమ్మమ్మ గారు.ఆమె కుటుంబం లో ఎవరికీ నేర్పలేదు.ఎందుకంటే వారికి ఆఅర్హతలేదు అని ఆమె భావించింది.డబ్బు తీసుకునేది కాదు ఆమె.ఆమె కేవలం 65వ ఏటనే 1980 లో మరణించారు.ఏపుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు?!🌷
నమ్ము నమ్మకపో! సేకరణ.-అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి