భారత రాజ్యాంగ స్ఫూర్తి దాతకు ఘనమైన నివాళులు; వెంకట్ మొలక ప్రతినిధి
 బొమ్మరాస్ పెట్ లోని ఎంఆర్సీ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు తెలియజేసిన విద్యావంతుల వేదిక నాయకులు.
రాజాంగాన్ని కాపాడుకుంటేనే సగటు భారతీయునికి భవిషత్తు లేదంటే అదోగతే
విద్యావంతుల వేదిక నాయకులు: రవీందర్ గౌడ్
భారత రాజ్యాంగంలోని లక్ష్యాలు కాపాడుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యం: బాకారం చంద్రశేఖర్
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మనది విశాలమైన దేశం భిన్న జాతుల, సంస్కృతుల సమహారమని 75 వసంతాలుగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నాం : గౌరారం గోపాల్
 వక్తలు మాట్లాడుతూ.60 దేశాల కు పైగా వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన అనంతరం భారత రాజ్యాంగం రూపొందించారని అందుకు దాదాపుగా 3 సంవత్సరాల కాలం పట్టిందని అన్నారు.భారత రాజ్యాంగానికి 105 సవరణలు జరిగినప్పటికి దాని మౌళిక విధానలను మార్చే అధికారం పార్లమెంట్ కు కూడా లేదని కేశవానంద భారతి Vs కేరళ కేసులో సుప్రీం కోర్ట్ సూచించిందని తెలియజేశారు.42 వ సవరణ ద్వారా లౌకిక విధానం అనే పదం చేర్చినప్పటికి రాజ్యాంగ మూల సూత్రం లోనే లౌకిక విధానం ఉందన్నారు అందుకు ఇతర మతాలకు రక్షణకై 29,30 నిబంధనలు ఉన్నాయన్నారు.దేశం ఐక్యత గా ఉండాలంటే మహానుభావుడు DR. BR. అంబేద్కర్ నేతృత్వంలో రచించబడ్డ రాజ్యాంగ పరిరక్షణ తప్ప ఇంకో మార్గం లేదని వారు అన్నారు 
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్  మండల అధ్యక్షులు వెంకటయ్య, తుంకిమెట్ల మాజీ ఉపసర్పంచ్,  ఐఆర్పి శ్రీనివాస్స్ ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు