541)కనకాంగదీ-
సువర్ణభుజకీర్తులున్నవాడు
కాంచనపు దేహమున్నట్టివాడు
సంపెంగవంటి శరీరమున్నవాడు
కనకమయమైన అంగములవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
542)గుహ్యః -
హృదయగుహలో నున్నట్టివాడు
అంతరంగమున దాగినవాడు
ఏకాంతముగా నుండినవాడు
కుబేరసమానుడు అయినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
543)గంభీరః -
జ్ఞానముతో గంభీరుడైనవాడు
ఐశ్వర్యము నిండినట్టివాడు
బలమును నింపుకొనినవాడు
వీరత్వము ప్రదర్శనచేయువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
544) గహనః -
సులభగ్రాహ్యము కానట్టివాడు
తెలుసుకొన వీలుకానివాడు
ఎరుగరానట్టి తత్వమున్నవాడు
గహనమూర్తి తానైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
545)గుప్తః -
నిగూఢమైన ఉనికిగలవాడు
కానబడనట్టి రూపముండువాడు
దాచబడిన రీతిలోనున్నవాడు
మొగలిరేకులతీరున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి