" కారల్ మార్క్" సేకరణ. కొప్పరపు తాయారు

 కారల్ మార్క్ అనే డాక్టర్ గారు ఆయన పేరున్న అంకారజిస్టు (అంటే కణాల,మూలకణాలు గురించి)అదే కాన్సర్ అంటారు .
                ఒక రోజు ఒక స్పెషల్ మీటీంగ్ కీ బయిలు దేరారు. మార్గ మధ్యంలో తుఫాన్ ‌ ప్రయాణం ఆపుకో వలసి వచ్చింది .తప్పనిసరి యై ఒక అద్దె కారులో బయలుదేరారు.మార్గం మధ్యలో తుఫాన్ 
ఎక్కువ అవడం వలన .ఆయన మార్గం తప్పారు.
అక్కడ ఒక పేదవారి ఇల్లు ఉంటే తన పరిస్థితిని చెబితే మాది చిన్న ఇల్లు తుఫాన్ తగ్గేవరకు ఉండ
వచ్చు పర్వాలేదు అని అతనిని లోపలికి ఆహ్వానించి టీ ఇచ్చి మర్యాద చేసింది ఆ ఇంటి ఇల్లాలు.
          తరువాత తన బిడ్డ ఉన్న ఉయ్యాల చెంత కూర్చుని ప్రార్దనలు చేసుకుంటూ ఉంది.
          డాక్టర్ గారు ఆమెను దేనికి నీ ప్రార్థన అని అడిగారు.
     ఆమే అంది నా బిడ్డ చాలా భయంకర మైన కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అంతే డబ్బు
పెట్టు కో లేక   చూపించ లేక ప్రార్థన చేస్తున్నా అందీ.
        అంటే మీ దేముడు మీ ప్రార్థన వింటాడ నే అనుకుంటూన్నారా ? అన్నారు 
        మేం చేయగలిగేది అదొక్కటే తప్పక సహాయం 
చేస్తారు అంది .
         ఆ డాక్టర్ పేరేమిటి?
   " కారల్ మార్క్" అందీ
 ఇప్పుడు ‌డాక్టర్ వంతయింది కళ్ళు నీళ్ళు పెట్టుకుని తన ప్రయాణపు మలుపు లు తాను ఈ ఇంటికి రావడానికి మార్గం నిర్దేశించిన విధానం తలుచుకునే సరికీ   జ్ఞానోదయం అయింది.
             అవును నీ ప్రార్థన లు ఫలించాయి అని ఆ బిడ్డ కు వైద్యం చేశాడు 
          అప్పుడు అనుకున్నాడు స్వచ్చమైన హృదయంతో ప్రార్థిస్తే దేముడు తప్పక వస్తాడు
సహాయం చేస్తాడు . అని 

కామెంట్‌లు