శ్యామశాస్త్రి- కొప్పరపు తాయారు
 శ్యామశాస్త్రి గారికి పేదరికం తెలియదు. మంచి భోక్త ఇంపైనా భోజనం. తాంబూలం మొదలగు రసస్వాధన వీరికి ఇష్టం. వీరి కీర్తనలలో దీనరసం ఉండదు. ఎందుకంటే మీరు సంపదలలో జన్మించినవారు. 
          ఈయన నాదము ఆత్మానందము కోసం ఉపాసించి సాధించిన ఫలం. ఈయన కీర్తనలలో ఉల్లాసం ఉత్సాహం తాళ ప్రదర్శన వలన చేకూరు చురుకుదనము కొట్ట వచ్చినట్టు ప్రదర్శితం అవుతాయి. చాలా ప్రసిద్ధిగాంచిన కీర్తనలు 20 రాగములకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రసిద్ధ రాగములందు వీరి కీర్తనలు ఎక్కువ అపూర్వ రాగము లలో కూడా కీర్తనలు ఉన్నాయి.

కామెంట్‌లు