రుణానుబంధం; లతాశ్రీ
 వాలు కుర్చీలో కూర్చుని తదేకంగా తనకు వచ్చిన ఉత్తరాన్ని చూస్తోంది.ఫారిన్ లో సెటిల్ అయిన తన బిడ్డలకు తన సంపాదన అవసరం .తను అవసరం లేదు.డబ్బుసంపాదనే ఒకటే ధేయమైన తన బిడ్డలను తలచుకొని ఏడవని క్షణం లేదు.
ఎంతో అపురూపమైన వస్తువు దగ్గరగా చూస్తున్నా అనుభూతితో చూస్తోంది. ఆ ఉత్తరం చదివి రజిని మనసు ఎంత ఆనంద పడిందో ! ఆమెను చూస్తుంటే తెలుస్తోంది.
అలా అలా ఆలోచిస్తూ గతంలోకి జారుకుంది రజిని మనసు. తను ఉపాధ్యాయినిగా లక్కవరం లో పనిచేస్తున్న రోజులవి... బాలాజీ అని విద్యార్థి పాఠశాలకు గత కొన్ని రోజులుగా రాకపోవడంతో తల్లిదండ్రులను పిలిచి విచారించింది. మేము పంపడానికి ఎంత ప్రయత్నించినా బాలాజీ పాఠశాలకు ససేమిరా అంటున్నాడు రావడం లేదు అని తల్లిదండ్రులు వాపోయారు.
విషయం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకతతో తనే బాలాజీ ఇంటికి వెళ్ళింది. బాలాజీ టీచర్ ని చూసి దాక్కున్నాడు తనే చొరవగా వెళ్లి బాలాజీ ఇటు రా అని పిలిచింది. తను కరాఖండిగా రానని చెప్పేశాడు. నేను నిన్ను పాఠశాలకు తీసుకుపోవడం లేదు ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని అందరి విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చాను నీకు కూడా ఈ చాక్లెట్ ఇచ్చి పోవాలనే వచ్చాను. ఇదిగో నీకు ఇష్టమైతే ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకో అన్నది చాక్లెట్ అనగానే దగ్గరకు వచ్చాడు. 
బాలాజీ రేపు మన పాఠశాలలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో నువ్వు కూడా పాట పాడుతావా అని అడిగింది. బెరుగ్గా చూశాడు నువ్వేం భయపడకు నీకు ఇష్టమైతేనే రేపు పాఠశాలలో ఎవరెవరైతే పాటలు పాడుతారు కథలు చెప్తారు వాళ్ళకందరికీ దీనికన్నా పెద్ద ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఇవ్వాలని మన హెచ్ఎం గారు అంటుంటే విన్నాను అందుకే నువ్వు రెండవ తరగతిలో చదువుతున్నప్పుడు గాంధీతాతకు సంబంధించి పాట పాడావు కదా ఆ పాట  పాడుతావేమో అని అడిగాను అంతే అన్నది.
మొదటగా ఆశ చూపినా.. అతని కళ్ళలో ఏదో దైన్యం కనబడింది రజనికి.
సరే నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెబితే నేను దానికి పరిష్కారం ఆలోచిస్తాను నువ్వు చాలా తెలివైన వాడివి ఇలా పాఠశాలకు దూరం కావడం ఏ మాత్రం బాగాలేదు అన్నది రజిత.
తనను ప్రశంసించడంతో బాలాజీ కాస్త ఊరట చెంది మరేమో! మరేమో! నాకు...హా నీకు అంది. నాకు రెండవ తరగతిలో పాఠాలు వచ్చు కాని ఇప్పుడు మూడో తరగతిలో చదవగలనా అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.ఓస్!
దీనికేనా ఇంత భయపడుతున్నావ్.
నీకు పాఠాలు నేను చెబుతాను ఏం భయపడకు ఏ అనుమానం ఉన్న నన్ను అడిగితే నేను చెబుతాను అంటూ అతడిని సముదాయించింది.అయితే తప్పకుండా పాఠశాలకు వస్తాను అన్నాడు సంతోషంగా....చిన్న పిల్లలతో కాస్త ఓర్పుగా మాట్లాడితే,వారిలోని శక్తి సామర్థ్యాలు ప్రశంసిస్తే వారు దైర్యం గా ముందుకెళతారు అనుకుంటూ ఇంటికి చేరింది 
మరుసటి రోజునుండి బాలాజీ  రజిత టేబుల్ పక్కనే మకాం వేశాడు.చురుకైన విద్యార్థిగా అభినందనలు అందుకున్నాడు.అతనికి ఏ చిన్న సందేహం కలిగినా తననువెదికే  అతని కళ్ళు..అతనికి ఎంత చనువు పెరిగిందంటే రజని మేడం వస్తువులు తనకే హక్కుఅన్నట్లు ప్రవర్తించే వాడు.ఎవరిని ముట్టనిచ్చేవాడు కాదు.రజని మేడం మాట చెబితే వేదం లాగా అనుసరించే వాడు.రజనికి ట్రాన్సఫర్ అయినప్పుడు బాలాజీ ఏడ్చిన ఏడ్పు ఇప్పటికీ గుర్తే...ఆ పాఠశాలలో తన మానస పుత్రుడు అంటూ అందరూ అన్న మాటలు గుర్తొచ్చి మనసు ఉప్పొంగింది.
ఇన్నేళ్ళ తరువాత తనని గుర్తుంచుకొని....అమ్మా అని పిలుస్తూ రాసిన ఉత్తరాన్ని తడిమి ,మరలా మరలా..చదివి తన అనుబంధాల ఆస్తి ని తనివితీరా చూసుకుంటోంది.తనలో తాను మురిసిపోతోంది .తన భార్య ముఖంలో సంతోషాన్ని చూసిన అభిరామ్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ...రజితా ఎన్నాళ్ళకు నీ మొహంలో ఆనందం చూస్తున్నా అంటూ ఇంతకీ ఆ ఉత్తరం ఎవరూ రాశారు అంటూ ఉత్తరం తీసుకొని చదివాడు.
నీ బిడ్డలు నీకు దూరమైన..నీ మానస పుత్రుడి పెళ్ళైనా నీ చేతులమీద జరగాలని దేవుడు వాంచించాడేమో.....సరే పద చాలా పొద్దుపోయింది అంటూ లేవదీశాడు .. రజిని ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకొని ఆనందంగా పడుకుంది..ఇక లేవలేదు.
బాలాజీ సొంత బిడ్డలా కర్మకాండలు నిర్వర్తించాడు..సొంత బిడ్డలు పొరుగు గడ్డ నుండి దృశ్యాలు తిలకించి తమ రుణం తీర్చుకున్నారు.భార్య సంపాదించుకున్న అనుబంధాల ఆస్తి ని తనివితీరా చూస్తూ సంతోషించాడు అభిరామ్.
కామెంట్‌లు