ప్రేమ!!;-- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మీరు మాకు ఏమీ ఇవ్వకున్నా
నీ దగ్గర ఉన్నది మీ దగ్గరే ఉన్న
మీరు మాకు ఇచ్చింది ఒకటి ఉంది
మేము మీ నుంచి తీసుకున్నది ఒకటి ఉంది
అది ప్రేమ కాదు-స్ఫూర్తి!!!

మా దగ్గర ఉన్నది మీరు తీసుకున్న
మీ దగ్గర ఉన్నది మేం తీసుకున్న
పెరిగేది ఒకటి ఉంది
అది ప్రేమ కాదు-మర్యాద!!!

ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ లేకున్నా
ఎవరి దగ్గర అడగ లేకున్నా
మీరు ఇవ్వగలిగేది
అది ప్రేమ కాదు-దయాగుణం!!!!

ఇవ్వడం తీసుకోవడం అంటేనే డబ్బు కాదు!
ఇవ్వడం తీసుకోవడం అంటేనే ప్రేమ కాదు!!
నీ దగ్గర ఇది లేకపోతే మనిషివే కాదు
అది ప్రేమ కాదు-మానవత్వం!!!!

ప్రేమ లేకున్నా ఇవన్నీ ఉంటే
ప్రేమ దానంతట అదే పుడుతుంది!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
కామెంట్‌లు