:నవ్య ప్రభంజనం ;- కె.ఆర్.భార్గవి పలమనేరు
కుసుమ ధర్మన్న కళాపీఠం
********
వంటింటి కుందేలుగా పరిమితమై 
కేవలం సంతానోత్పత్తికి,ఇంటి చాకిరికి చిరునామాగా 
మొదలైన ఆమె (స్త్రీ) ప్రస్థానం..

ఒక్కొక్క అడుగు దాటుకుంటూ 
తన ముందరి కాళ్ళ సంకెళ్ళను ఛేదించు కుంటూ 
ఇంటిని వీడి _ పంజరం నుండీ విముక్తి పొంది
కొత్త విద్యలు నేర్చుకుంటూ 
శైలిని మార్చుకుంటూ
నైపుణ్యాలను పెంచుకుంటూ
పురుషులతో సమానంగా
కాదు,
వారికంటే మహోన్నతంగా, కొత్త పోకడలను అవలంభించుకుంటూ సాగుతోంది
హద్దుల వివక్షలను అధిగమిస్తూ...

విహంగంలా అన్ని రంగాలలో
దూసుకెళుతూ అంబరాన్ని దాటి రోదసి లోనికి పయనమై
తనకు తానే సాటియంటూ
విరించి సృజనలో ఆమెయే మేటిగా..
 
జీవన సమతుల్యత 
మమతానురాగాల పొదరిల్లులో సంబందాలను పెనవేయగలిగే సమర్థత,
నిశిత సమగ్ర ఆలోచనా
సరళీ
పక్కా ప్రణాళిక బద్ధ సాధన
సేవాతత్పరత, బహుముఖ ప్రఙ్ఞలతో శతావధానం
బహుపాత్రాభినయనం నెరపగల ధీమంతురాలీ వనిత...

పెరుగుతున్న సాంకేతిక విప్లవం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళుతూ
స్త్రీ జాతికి పట్టాభిషేకం చేస్తూ 
చేయి చేయి కలిపి
ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహింప చేస్తూ
దేశాన్ని ప్రగతి బాటలో
నడిపిద్దాం 
వివక్ష సంకెళ్ళను నేడే చేధిద్దాం 
మహిళా శక్తిని  ఎదుగనిద్దాం 
నవ చైతన్యానికి పలుకుదాం ఓంకారం..శ్రీకారం

అదే మన సంస్కృతికి, 
వనితా శక్తికి మనమొనగే వందన సమర్పణం!!

కామెంట్‌లు