వింతలు విడ్డూరాలు! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏర్స్ రాక్ ఇంకోపేరు ఉలురు.ఇదిమధ్య ఆస్ట్రేలియా లో ఉన్న శాండ్ స్టోన్.ఆప్రాంతంలో నివసించే అబోరిజైన్స్ అనే తెగవారికి చాలా పవిత్రమైనది.సృష్టి ప్రారంభం ని వారు డ్రీంటైం అని అంటారు.ఈబండరాయి వారి కి ఎంతో పవిత్రమైనది.వారి మతకార్యకలాపాలకు వాడుతారు ఈ బండరాయిని.దీనికి మంత్ర తంత్ర శక్తులు ఉన్నాయని వారి నమ్మకం.ఎవరైనా యాత్రికులు ఆరాతిముక్కలు పగులగొట్టి తీసుకెళ్తే వారి కి కీడు జరగటం ఖాయం.ఉలురు అనే ఈ పెద్ద బండ రాయి పై ఎలాంటి గడ్డిగాదం మొలవదు.ఎరుపురంగులో ఈబండ348 మీటర్ల ఎత్తు 3 కి.మీ.పొడవుంటుంది.భూమిలోపల 6కి.మీ.ఉంది ఈబండ.ఇది ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తూ ఉంటుంది.రోజంతా ఏడాది పొడుగుతా సూర్యోదయం సూర్యాస్తమయం వేళల్లో ఈ రాతిబండ రంగుల అందాలు చూసి తీరాల్సిందే సుమా.🌹
కామెంట్‌లు