నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు ఎతి అనే పదం తెలుసు.హిమాలయాల్లో ఓపెద్ద చింపాంజీ లాంటి జంతువుని చూశాం అని టెన్జింగ్ నార్కె తో సహా ఎంతోమంది అన్నారు.ఈప్రాణినే ఎబామినబుల్ స్నోమాన్ అని కూడా అంటారు.అమెరికా ఉత్తర పశ్చిమ ప్రాంతంలో సస్క్వాచ్ అనే పెద్ద కోతి లాంటి ప్రాణి ఉంది అని కనుగొన్నారు.ఒళ్ళంతా బొచ్చు తో చాలా పెద్ద పాదాలతో తిరుగుతూ ఉంటుంది అని అంటారు.నిజం ఇంకా తేలలేదు.
అలాగే ఓపెద్ద భయంకర పాముతల అచ్చు మొసలిముట్టె లాగా ఉంటుంది.10మీటర్ల పొడవుతో నీటిపై అరమీటరుతలభాగాన్ని ఎత్తి ఉంటుంది.దాని శరీరం మూడు చోట్ల  మూపురం లాగా ఉండే ఈ ప్రాణిని స్లిమీ స్లిం అని పిలిచేవారు.బెస్తవారు దానికై  లేక్ పాయెట్టే ని గాలించారు.అది ఓరకపు మొసలి అని కొందరు భావిస్తే అది నీటిలో ఉండే రాక్షసప్రాణి అని అంటారు.భాగవతంలో చిన్ని కృష్ణుని కాళీయమర్దనం‌‌
మన పురాణాల్లో వర్ణించిన వాసుకి తక్షకుడు పాములు.మరి భారతీయ సంస్కృతి సాహిత్యం లో ఇలాంటి రాక్షసులు వింత జంతువులు చాలా కన్పడ్తాయికదూ🌹
కామెంట్‌లు